సర్పంచ్ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 05వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రజాసేవ పట్ల అంకితభావంతో, ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్‌ఎస్ మద్దతుదారుడు చెర్ల మురళి (సర్పంచ్ అభ్యర్థి) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు.ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూ, గ్రామాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి, నిన్నటి వరకు గ్రామం అంతా తిరుగుతూ ఓటర్లను కలిశారు. ప్రజాసేవ చేయాలనే తపనతో ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న సమయంలో, ఆకస్మిక హృద్రోగంతో ఆయన అర్థాంతరంగా కన్నుమూయడం గ్రామస్తులను శోకసంద్రంలో ముంచెత్తింది.గ్రామంలో విషాద...