“సారు రావాలి… సర్కార్ రావాలి” కే.చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో భారత రాష్ట్ర సమితి నేతల నినాదాలు
మెదక్,ఫిబ్రవరి17(మనప్రజాప్రతినిధి):భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు మెదక్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, “సారు రావాలి – సర్కార్ రావాలి” అనే నినాదంతో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి సజావుగా సాగిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్...