భోగి–సంక్రాంతి వేళ ఆధ్యాత్మిక సందేశం ఇచ్చిన ఎస్ సి వి నాయుడు<br>
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం,జనవరి14శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు ఎస్ సి వి నాయుడు భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి, సుఖ సంతోషాలు,అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.భోగి, సంక్రాంతి, కనుమపండుగలు ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతి సంపదను కాపాడుకోవడం, పరులకు ఉపయోగపడే విధంగా జీవించడం అనే జీవన సత్యాలను బోధిస్తా యని తెలిపారు. హిందూ సనాతన ధర్మంలో జీవుడు ఉన్నత స్థితికి చేరాలంటే ప్రకృతిని ఆరాధిస్తూ, నిస్వార్థంగా మనిషికి మనిషి సహకరించుకుంటూ జీవించడమే...