సమస్యలకు ముందే పరిష్కారం-అభివృద్ధే లక్ష్యం
•“సమస్యలు రాకముందే నివారణే మా పాలన నినాదం-అభివృద్ధిలో ప్రతి వీధికీ ప్రాధాన్యం” •“పారదర్శక పాలనతో గ్రామాభివృద్ధికి కొత్త దిశ”•“ప్రజల భాగస్వామ్యంతో సమస్యలేని గ్రామ నిర్మాణమే లక్ష్యం”తిమ్మారెడ్డిపల్లిలో తొలి గ్రామసభలో సర్పంచ్ వెంకటేశం గౌడ్ స్పష్టంమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి20గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే తన ఏకైక లక్ష్యమని తిమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ స్పష్టం చేశారు. కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన తొలి గ్రామసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రెండు సంవత్సరాల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన ఆదాయ–వ్యయాల...