రోడ్డెక్కిన పశువులు నిర్లక్ష్యానికి నిదర్శనం

-పశువుల నియంత్రణపై పట్టింపు కరవు-కనుమరుగైన బందెల దొడ్లు-రహదారులపై పెరుగుతున్న పశువుల సంచారం-అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి-మున్సిపల్ పాలకవర్గంపై ఆశలు చర్యలు మాత్రం శూన్యంమనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్, ఆగష్టు16*హుజూర్‌నగర్ మెయిన్ రోడ్లపై పశువుల సంచారం మాత్రం తగ్గడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో యజమానులు పశువులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో పశువులు గుంపులుగా తిరుగుతూ రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో రహదారులపై పశువులు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే...