ప్రజాస్వామ్య బలోపేతానికి విద్యార్థుల ప్రతిజ్ఞ – మొగుడంపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘన నిర్వహణ

•ఓటు హక్కు విలువను విద్యార్థులకు వివరించిన ఇన్‌చార్జ్ హెచ్‌ఎం ప్రకాష్-ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ •ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం-మొగుడంపల్లి పాఠశాలలో విద్యార్థుల ప్రతిజ్ఞ మొగుడంపల్లి,జనవరి23(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 23వ తేదీ శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మయూరి, అనిత, పీటీ శోభా, శైలజ, సురేఖ, నజీర్ షరీఫ్, షకీల్ మాజిద్, నాసర్, షఫీ అహ్మద్,...