సిద్దిపేట సహాయ కార్మిక లేబర్ అధికారి పై తక్షణ చర్యలు తీసుకోండి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట,బుధవారం,19సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న సహాయ కార్మిక లేబర్ అధికారి కార్యాలయంలో ప్రజా సమస్యలను విన్నవించడానికి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్లగా, అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. జిల్లా అధికారి గారికి ఫోన్ చేసినప్పటికీ, స్పందన లేకుండా ఉండటం ప్రజా సమస్యల పట్ల నిర్వాహక వ్యవస్థ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని బీఎస్పీ నాయకులు ఎద్దేవా చేశారు. గత 15 రోజులుగా సంబంధిత అధికారిని సంప్రదించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ, ఫోన్ రెస్పాన్స్ లేకపోవడం, కార్యాలయానికి వచ్చినా అక్కడ అధికారి అందుబాటులో...