manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 1:13 pm Posted by : Mana Praja Prathinidhi

టీడీపీ తిరుపతి జిల్లా పగ్గాలు డాలర్స్ దివాకర్ రెడ్డికి!

అధిష్టానం కీలక నిర్ణయం-సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యం•చంద్రబాబు-లోకేష్ నమ్మకానికి గుర్తింపు•2024 విజయానికి కీలక పాత్ర
మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.డిసెంబర్21
తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా రాజకీయాలకు కొత్త ఉత్సాహం నింపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదివారం విడుదల చేసిన జిల్లాల నియామకాల జాబితాలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువనాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి శ్రీ నారా లోకేష్ దివాకర్ రెడ్డి అంకితభావాన్ని, నిర్విరామ సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక బాధ్యతను అప్పగించారు.పనితీరుకు గుర్తింపు2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి దివాకర్ రెడ్డి పోషించిన కీలక పాత్ర, తుడా చైర్మన్‌గా స్వల్ప కాలంలోనే ప్రజలకు కనిపించే అభివృద్ధి, సమర్థ పాలన ఆయనను జిల్లాలో శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టాయి.
చరిత్రాత్మక సమస్యలకు పరిష్కారందశాబ్దాలుగా పరిష్కారం కాని శెట్టిపల్లె భూ సమస్యకు ముగింపు,స్వర్ణముఖి నదిప్రక్షాళన, శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్ అమలు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దివాకర్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనంగా నిలిచాయి.సమన్వయమే మంత్రంనియామకంపై స్పందించిన డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితుడవ్వడం గర్వకారణమన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి కార్యకర్తకు అండగాతిరుపతి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానని, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుతూ పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.పార్టీ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా పని చేస్తానని, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని దివాకర్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు.