సంతాన మల్లికార్జున సమేత విజయదుర్గా దేవి ఆలయంలో 2026 కాలమానిని ఆవిష్కరణ

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి1కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో గురువారం నాడు 2026 సంవత్సరానికి సంబంధించిన కాలమానిని క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథ శర్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రంలో ఏడాది పొడవునా నిర్వహించనున్న వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలతో ఈ కాలమానిని రూపొందించినట్లు తెలిపారు. క్షేత్రంలో ప్రతి శుక్రవారం రాహు–కేతు దోష నివారణ, కుజదోష నివారణ కోసం రాహుకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.అలాగే ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రం రోజున సంతాన...