బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆపాలి

•హిందూ మైనారిటీల రక్షణకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలితిరుపతిలో హిందూ సంఘాల ఉగ్ర నిరసనమనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.తిరుపతి,డిసెంబర్‌24:బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, దేవాలయాల విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తూ బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌ వేదికగా హిందూ సంఘాలు, ప్రజాప్రతినిధులు ఉగ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులు ప్రపంచ మానవ హక్కుల వ్యవస్థపై ప్రశ్నార్థకంగా మారాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను క్రూరంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్యగా నిరసనకారులు పేర్కొన్నారు....