జవారిపేట శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

మనప్రజాప్రతినిధి// రాజన్నసిరిసిల్ల జనవరి, 02 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని జవారిపేట గ్రామ శివారులో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.మృతురాలి వివరాలు:వయస్సు: సుమారు 60 ఏళ్లు ఉండవచ్చు.నగలు: మెడలో బంగారు రంగు గొలుసు (నల్లపూసలు), చేతులకు గాజులు ఉన్నాయి.దుస్తులు: గోధుమ రంగు డిజైన్ ఉన్న బ్లౌజ్ ధరించి ఉంది.మృతురాలి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా ఈ మహిళను గుర్తుపట్టినట్లయితే లేదా ఏవైనా వివరాలు...