ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నర్సిములు డిమాండ్సదాశివపేట,డిసెంబర్18(మనప్రజాప్రతినిధి)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, దానిని పథకంగా మార్చి కూలీల జీవనాధారాన్ని దెబ్బతీయవద్దని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు నిరసనగా బుధవారం సదాశివపేట మండలం ఆత్మకూర్ చౌరస్తాలో ఆ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నర్సిములు మాట్లాడుతూ, ఉపాధి హామీని పని హక్కుగా కాకుండా...