సిరిసిల్ల పురపాలక తుది ఓటర్ల జాబితా విడుదల
రాజన్నసిరిసిల్ల,జనవరి12(మనప్రజాప్రతినిధి):సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను సోమవారం అధికారులు అధికారికంగా విడుదల చేశారు. మున్సిపల్ అధికారులు ప్రకారం, ఈ జాబితా ప్రజల పరిశీలనార్థం మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపైప్రదర్శించబడిందితాజా గణాంకాల ప్రకారం, సిరిసిల్ల పట్టణంలో మొత్తం81,959మంది ఓటర్లు ఉన్నారు:పురుషులు: 39,942మహిళలు: 42,011.ఇతరు లు:6గత జనవరి 1న విడుదల చేసిన ముసాయిదా జాబితాపై మొత్తం 47 అభ్యంతరాలు/దరఖాస్తులు వచ్చినవి. వీటిలో 12 దరఖాస్తులను ఈఆర్ఓ (ERO) పరిష్కరించగా, మిగతా 37 దరఖాస్తులను మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించిన...