మొగుడంపల్లి మండల కేంద్రంలో మేకలు–గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమం ఘనంగా ప్రారంభం
సంగారెడ్డి.డిసెంబర్23(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. పశు సంపద ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల డిసెంబర్ 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.మండల కేంద్రంలోని స్థానిక పశు చికిత్స శాలల్లో ఈ కార్యక్రమాన్ని పశు చికిత్స వైద్య అధికారి డాక్టర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. పశువుల్లో నట్టల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారించి,...