భూంపల్లి గ్రామంలో ఉచిత ట్రైలరింగ్ శిక్షణ ముగింపుకంటి పరీక్ష కార్యక్రమం ఘనంగా
సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట-భూంపల్లి మండలం -ఈ రోజు భూంపల్లి గ్రామంలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైలరింగ్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ.బక్కివెంకటయ్య-భాగ్యలక్ష్మి హాజరయ్యారు.చైర్మన్ వెంకటయ్య గారు మహిళలు అన్ని రంగాలలో ముందుకు రాణించాల్సిన అవసరం గురించి స్పష్టంగా చెప్పారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు స్వంత గ్రామంలోనే ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని, నలుగురికి శిక్షణ నేర్పించే విధంగా అవకాశాలు ఏర్పరచాలని సూచించారు.ఎర్త్ ఫౌండేషన్ కో-ఫౌండర్...