యాప్‌ల పేరుతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

•యూరియా ఇవ్వలేక ఆన్‌లైన్ డ్రామాలు-బుర్రసూర్యగౌడ్ ఫైర్మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్20ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం యాప్‌లు, ఆన్‌లైన్ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆరోపించారు.నాట్లు వేసుకునే కీలక సమయంలో రైతులు పొలాల్లో ఉండాలా? లేక వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ యాప్‌లు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అంటూ కాలయాపన చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. యూరియా సరిపడా...