కనిపించని ‘కొలనూరు’ బోర్డు… దారి తప్పుతున్న వాహనదారులు

•పిచ్చి మొక్కల చాటున ‘కొలనూరు’ గ్రామ బోర్డువాహనదారులకు తీవ్ర ఇబ్బందులుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజనవరి,2రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామ సరిహద్దు బోర్డు నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కల మధ్య పూర్తిగా దాగిపోయింది. సిరిసిల్ల–కోనరావుపేట ప్రధాన రహదారిపై ఉన్న ఈ బోర్డు చుట్టూ చెట్లు, పొదలు విస్తరించడంతో ప్రయాణికులకు బోర్డు కనిపించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా కొత్తగా వచ్చే వారు గ్రామంలోకి ప్రవేశించిన విషయం తెలియక తికమక పడుతు న్నారని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో అయితే బోర్డు పూర్తిగా కనిపించకపోవడంతో వాహనదారులు కొలనూరు గ్రామాన్ని దాటి...