చంద్రగిరి నూతన సర్పంచ్‌కు కురుమ సంఘం ఘన సన్మానం

మనప్రజాప్రతినిధి,వేములవాడ.జనవరి14రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిధిలోని చంద్రగిరి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ముత్త సంజన మహేష్‌ను కురుమ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.బుధవారం గ్రామంలోని బీరప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షులు ముత్త ఎల్లయ్య మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో నూతన సర్పంచ్ చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సర్పంచ్ ముత్త సంజన మహేష్‌ను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా గౌరవించారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘం...