స్వర్గీయ పప్పతి నర్సింహారెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సదాశివపేటలో టోర్నమెంట్‌ను ప్రారంభించిన సిడిసిచైర్మన్ గడీల రామిరెడ్డి,సీఐవెంకటేశం సదాశివపేట,జనవరి11(మనప్రజాప్రతినిధి):కీ.శే. స్వర్గీయ పప్పతి నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ గారి స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం సదాశివపేటలో ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను సిడిసి చైర్మన్ గడీల రామిరెడ్డి, సదాశివపేట సీఐ వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ సిద్ధన్న, సర్పంచులు ఆశి రెడ్డి, బలరాం, శ్రీనివాస్ రాజు, శ్రీను పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు పిఎసిఎస్ మాజీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు....