manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 10:51 am Posted by : Mana Praja Prathinidhi

మండలస్థాయిసైన్స్ఎగ్జిబిషన్ ఘనంగానిర్వహణ

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్17
ఏర్పేడుజిల్లాపరిషత్ఉన్నతపాఠశాలప్రాంగణంలో 17-12-2025 మండలస్థాయిసైన్స్ఎగ్జిబిషన్‌నుఘనంగానిర్వహించారు. ఈకార్యక్రమాన్నిమండలవిద్యాశాఖాధికారులు శ్రీమతిప్రేమలత,శ్రీదయాకర్సమన్వయంతోవిజయవంతంగా నిర్వహించారు.ఈసందర్భంగామండలవిద్యాశాఖాధికారిశ్రీదయాకర్ మాట్లాడుతూ,విద్యార్థుల సృజనాత్మక తను వెలికి తీయడంలోసైన్స్ఎగ్జిబిషన్‌లు కీలకపాత్రపోషిస్తాయనిఅన్నారు.  విద్యార్థుల్లోవిజ్ఞానశాస్త్రంపైఆసక్తిని పెంపొందించడంతో పాటు, వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా ఈకార్యక్రమం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థులు ఆలోచనా శక్తిని పెంచుకుని భవిష్యత్‌లో శాస్త్రీయ రంగాల్లో రాణించే అవకాశం ఉందని వివరించారు.ఈ సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలు, ప్రాజెక్టులుఅందరినీఆకట్టుకున్నాయి. పాఠశాలప్రధానోపాధ్యాయురాలుశ్రీమతిమునిలక్ష్మీవిద్యార్థులనుఅభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం ద్వారా విద్యలో నాణ్యత మరింత మెరుగవుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో ఏర్పేడుమండలంలోనివివిధపాఠశాలలసైన్స్ ఉపాధ్యాయులు,విద్యార్థులుపెద్దసంఖ్యలోపాల్గొనికార్యక్రమాన్నివిజయవంతంచేశారు.