మొగుడంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం
సంగారెడ్డి,డిసెంబర్22(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బి. రాజు, ఉప సర్పంచ్ పి. సంజీవరెడ్డి, వార్డు సభ్యులు తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యదర్శి బి. మారుతి అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగామండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్,మాజీ సర్పంచ్ పి. వెంకట్రాంరెడ్డి,బి. ప్రేమ్ కుమార్ కుల్కరిణి,మాజీ...