భక్తులే కేంద్రంగా నూతన పాలకమండలి కీలక నిర్ణయాలు దేవాలయ అభివృద్ధికి స్పష్టమైన దిశ-చైర్మన్ బత్తల గిరినాయుడు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్23ఎర్పేడు మండలంలోని దేవాలయ వసతి గృహంలో నూతన పాలకమండలి సమావేశం అత్యంత ప్రాముఖ్యతతో నిర్వహించబడింది. ఈ సమావేశంలో భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి, పాలకమండలి సభ్యులు.చైర్మన్ ఏకగ్రీవంగా చారిత్రాత్మక తీర్మానాలు ఆమోదించారు.రాబోయే నూతన సంవత్సరం ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించగా, సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పాలకమండలి స్పష్టంగా ప్రకటించింది.మాస ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి వస్త్ర సేవ, అభిషేక అలంకరణ (పట్టు...