సూరారం గ్రామంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
సదాశివాపేట,డిసెంబర్22(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం సూరారం గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి విడతగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గం సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది.ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా మొగ్దుం పటేల్, ఉప సర్పంచ్‌గా మొహమ్మద్ హైమద్‌తో పాటు వార్డు సభ్యులు ఎన్నికై, గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి శిరీష నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కార్యక్రమంలో కార్యదర్శి శిరీష మాట్లాడుతూ,...