ముస్లాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఘనంగా ‘పోషణ్ మహా పండగ’

మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్ 20మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘పోషణ్ మహా పండగ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ ఇళ్ల నుంచి పలు రకాల పోషకాహార వంటకాలను పాఠశాలకు తీసుకువచ్చారు. పిల్లలు స్వయంగా తయారు చేసి తీసుకువచ్చిన వంటకాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రుచి చూసి చిన్నారులను అభినందించారు.పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యవంతమైన జీవనశైలిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత ఈ...