రెవెన్యూ శాఖ పేదల శత్రువుగా మారింది-బినామీ పట్టాల వెనుక అధికారుల మాఫియా

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్21శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ పేదల శత్రువుగా మారిందని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ భూములు పేదలకు చెందాల్సి ఉండగా, రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లపై పట్టాలు జారీ చేసి భూదోపిడీ జరుగుతోందని మండిపడ్డారు.పేద రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములను లాక్కొని, స్థానికేతరులకు డీకేటి పట్టాలను మిల్ట్రీ పట్టాలుగా మార్చడం ద్వారా రెవెన్యూ అధికారులు భూదందాకు తెరలేపారని ఆరోపించారు. ఫ్యాక్టరీల ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జా చేసి, అధికార పార్టీకి చెందిన కొందరు...