manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 12:10 pm Posted by : Mana Praja Prathinidhi

జ్యోతిర్ముడులతో శ్రీశైలానికి బయలుదేరిన శివస్వాములు

•46 మంది శివస్వాముల భక్తి యాత్ర-శ్రీశైలం క్షేత్రానికిజ్యోతిర్ముడుల సమర్పణ

“శివనామ స్మరణతోనే భక్తులకు ముక్తి”-గురుస్వామి
సదాశివపేట,ఫిబ్రవరి8(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని శ్రీ సంగమేశ్వర ఆలయం నుండి శివమాల ధారణ చేసిన శివస్వాములు జ్యోతిర్ముడులతో శ్రీశైలం క్షేత్రానికి భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. పిల్లోడు రాచన్న గురుస్వామి ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుండి పరమేశ్వరునికి రుద్రాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్ముడులు కట్టుకొని “ఓం నమశ్శివాయ” నినాదాలతో స్థానిక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనార్థం యాత్రకు బయలుదేరారు.ఈ సందర్భంగా రాచన్న గురుస్వామి మాట్లాడుతూ, గత నలభై రోజులుగా శివమాల ధారణ చేసి నిష్టతో పూజలు నిర్వహించిన స్వాములు శ్రీశైలం క్షేత్రంలో జ్యోతిర్ముడులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. శివనామ స్మరణ ద్వారా భక్తులకు మనశ్శాంతి లభించడంతో పాటు భుక్తి, ముక్తి రెండూ సిద్ధిస్తాయని పేర్కొన్నారు.ఈ యాత్రలో శ్రీ సంగమేశ్వర ఆలయం నుండి మల్లేశం గురుస్వామి, మధునాల్ గురుస్వామి, పోల వెంకటేశం గురుస్వామి, బాలరాజ్ గురుస్వామి, గంగారం గురుస్వామి, రాజశేఖర్ గురుస్వామి, రమేష్ గురుస్వామి, లోకేష్ గురుస్వామి, నర్సింలు గురుస్వామి, మోహన్ స్వామి, సురేష్ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, శ్రీరామ్ శ్రీనివాస్ గురుస్వామి, పి. విఘ్నేశ్వర స్వామి, వీరేందర్ స్వామి, పాండు గురుస్వామి, జి. వెంకటేశం స్వామి, అడి వయ్య స్వామి, రామ్ రెడ్డి పటేల్ స్వామి తదితరులు సహా మొత్తం 46 మంది శివస్వాములు పాల్గొన్నారు.