జ్యోతిర్ముడులతో శ్రీశైలానికి బయలుదేరిన శివస్వాములు
•46 మంది శివస్వాముల భక్తి యాత్ర-శ్రీశైలం క్షేత్రానికిజ్యోతిర్ముడుల సమర్పణ “శివనామ స్మరణతోనే భక్తులకు ముక్తి”-గురుస్వామిసదాశివపేట,ఫిబ్రవరి8(మనప్రజాప్రతినిధి)సదాశివపేట పట్టణంలోని శ్రీ సంగమేశ్వర ఆలయం నుండి శివమాల ధారణ చేసిన శివస్వాములు జ్యోతిర్ముడులతో శ్రీశైలం క్షేత్రానికి భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. పిల్లోడు రాచన్న గురుస్వామి ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుండి పరమేశ్వరునికి రుద్రాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్ముడులు కట్టుకొని “ఓం నమశ్శివాయ” నినాదాలతో స్థానిక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి...