ఆరుద్ర నక్షత్రం మహత్యంతో వెలుగొందిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం
•కలియుగ కల్పవృక్షుడు శ్రీ పరశురామేశ్వర స్వామి •భక్తులకు అపూర్వ ఫలితాలు అందించే నూతన వస్త్ర సేవ పూజ ప్రారంభంమనప్రజాప్రతినిధి//ఎర్పేడుమండలం,డిసెంబర్24శైవ సంప్రదాయంలో విశిష్టమైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఏర్పేడు మండలంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని నూతనంగా వస్త్ర సేవ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భక్తుల్లో విశేష ఆదరణ పొందుతోంది.పురాణాల ప్రకారం ఆరుద్ర నక్షత్రం రోజునపరమశివుడు నటరాజ స్వరూపంలో ఆనంద తాండవం చేసిన దివ్య దినంగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ పవిత్ర నక్షత్రంలో శివారాధన చేయడం వల్ల జన్మజన్మాంతర పాపాలు...