manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 2:05 pm Posted by : Mana Praja Prathinidhi

ఈశ్వరచారిఆత్మహత్యకురాష్ట్రప్రభుత్వమేబాధ్యతవహించాలి

బీసీసాదారికతసంఘంమండల అధ్యక్షుడుగజ్జెలరాజశేఖర్ గౌడ్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబరు 05
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈశ్వర చారి గారు ఆత్మహత్యకు శరణు వెళ్లిన సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బీసీ సాదారికత సంఘం మండల అధ్యక్షుడు గజ్జెల రాజశేఖర్ గౌడ్, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సమాజానికి తగిన అవకాశాలు, హక్కులు అందే వరకు ప్రతి బీసీ కుటుంబం నుంచి నాయకులు ముందుకు వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే బీసీ యువత భవిష్యత్తు కోసం 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు బీసీ నాయకులందరూ ఐక్యతగా పోరాటం కొనసాగించాలని గజ్జెల రాజశేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు.