గ్రూప్–1 మెయిన్స్ కేసు తీర్పు వాయిదా
- ఫిబ్రవరి 5న తుది తీర్పు ప్రకటించనున్న హైకోర్టు- సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలైన అప్పీళ్లపై నిర్ణయం పెండింగ్- నియామకాలు తుది తీర్పుకు లోబడి కొనసాగుతాయిహైదరాబాద్, జనవరి 22 (మనప్రజాప్రతినిధి):తెలంగాణ గ్రూప్–1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో తుది తీర్పును ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ మరియు జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో...