కొలనూరు గ్రామానికి నూతన ప్రజాస్వామ్య వెలుగులు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.డిసెంబర్ 22:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఉత్సాహభరితంగా, ప్రజల నడుమ ఘనంగా జరిగింది. గ్రామాభివృద్ధిపై నూతన ఆశలను రగిలిస్తూ ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌గా జలగం అరవింద్, ఉప సర్పంచ్‌గా బిట్ల బాబు ప్రమాణ స్వీకారం చేసి గ్రామ ప్రజలకు సేవ చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు.అలాగే వార్డు సభ్యులుగాబిట్ల దేవలక్ష్మి, తుమ్మల సురేష్, బోలగం కమలాకర్, వీరవేణి భాగ్య, కాదాసు లత,...