manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 4:49 pm Posted by : Mana Praja Prathinidhi

ప్రభుత్వ నిషేధాన్ని లెక్కచేయని చైనా మాంజా.. మహిళ గాయపడిన ఘటన

చైనా మాంజా ముప్పు.. మహిళ కుడికాలికి లోతైన గాయాలు
•చేగుంటలో చైనా మాంజా కలకలం..మహిళకు తీవ్ర గాయాలు.

మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా,చేగుంట.జనవరి14
ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వినియోగంతో చేగుంట మండల కేంద్రంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు అయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పతంగి ఎగురవేసిన సమయంలో చైనా మాంజా తగలడంతో చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన చేరి మన్నెమ్మ కుడి కాలికి లోతైన గాయాలు ఏర్పడి అధిక రక్తస్రావం జరిగింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టణ కేంద్రాల్లో చైనా మాంజా వినియోగం కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పట్టణంలో చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.