నారాయణపూర్‌లో ఘనంగా గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి14రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బుధవారం నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.శాస్త్రోక్తంగా వేడుకలుఅర్చకులు వేణుగోపాల చారి, నవీన్ చారి, శివ శాస్త్రిల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, వేడుకోళ్లు నిర్వహించారు. అనంతరం శివాలయం సమీపంలోని కళ్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛారణల నడుమగోదారంగనాథుల కళ్యాణం శాస్త్రోక్తంగా సాగింది.వేములవాడ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన నారాయణపూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే ఈ...