ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక నెల –తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

సిద్దిపేటనియోజకవర్గం.జనవరి23(మనప్రజాప్రతినిధి)వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రగతి కోసం తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి కోరారు.శుక్రవారంకళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇంటర్ విద్య బలోపేతానికి అనుకూలంగా చర్యలు తీస్తుందని, కళాశాల ఆధునికీకరణ, ల్యాబ్ మెటీరియల్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాల కోసం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.డిజిటల్ విద్యకు శ్రీకారం:కళాశాలలో 4 డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు డిజిటల్ విద్య ప్రారంభించామని, విడుదల చేసిన నిధుల ఉపయోగాల వివరాలను...