వెల్టూరు గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన తొంట రాజు

సదాశివపేట, నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో శుక్రవారం తొంట రాజు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో నుంచే పని చేస్తానని ఆయన తెలిపారు. గ్రామంలో చిన్నా–పెద్దా తేడా లేకుండా అందరికి సహాయం చేస్తూ మంచి పేరు పొందిన రాజు, నామినేషన్ అనంతరం మాట్లాడుతూ “గ్రామస్థుల మద్దతు ఉంటే మీ కొడుకులా, మీ తమ్ముడిలా, మీ అన్నలాగా ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను. గ్రామ సమస్యలను పై అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారం...