టమాటా ధరలు భగ్గుమంటూ..
- తెలంగాణ మార్కెట్లలో కేజీ ఎనభై రూపాయలుహైదరాబాద్, నవంబర్ 24,మనప్రజాప్రతినిధి:రాష్ట్రవ్యాప్తంగా టమాటా ధరలు ఒక్కసారిగా కొండెక్కి సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కిలోకు ఇరవై నుంచి నలభై రూపాయల మధ్య లభించిన టమాటా ధరలు ఇప్పుడు అరవై నుంచి ఎనభై రూపాయల వరకు చేరిపోయాయి. కరీంనగర్, రాయదుర్గం, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన మార్కెట్లతో పాటు నగరాల్లోని రిటైల్ కూరగాయల దుకాణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజువారీ వంటలో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇంత ఖరీదుగా మారడంతో గృహిణులు...