రాయపోల్ మండలంలో నడిరోడ్డుపై పడిన చెట్లు  అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం

(మనప్రజాప్రతినిధి//మే 06)సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్ర పరిధిలో గజ్వేల్ నుండి తిమ్మక్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదకర పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి రహదారి పక్కన ఉన్న చెట్లు వేరుతో సహా కూలి నడిరోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటన ఇండియన్ బ్యాంక్ సమీపంలో సుమారు 100 మీటర్ల దూరంలో చోటుచేసుకుంది.ఈ ఉదయం సుమారు 10 గంటల సమయానికి కూడా చెట్లు తొలగించకపోవడంతో రహదారిపై రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. వాహనదారులు ఇబ్బందులు పడటంతో పాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశం...