manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 5:54 pm Posted by : MANA PRAJA PRATINIDHI

తెలంగాణ జానపద కళాకారుల సంఘం నేరేడుచర్ల మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:

తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నేరేడుచర్ల మండల కమిటీ ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.స్థానిక అరిబండి భవన్లో జరిగిన కళాకారుల ముఖ్య సమావేశానికి హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు దొంత గాని సత్యనారాయణ గౌడ్,గోపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మరియు నెమ్మది శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. వారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికైన నూతన కమిటీ వివరాలు గౌరవ అధ్యక్షులు దొంతగాని వెంకటేశ్వర్లు గౌడ్అధ్యక్షులు రాపూలు అపర్ణ 
ప్రధాన కార్యదర్శి దొరేపల్లి వెంకటేశ్వర్లు
ఉపాధ్యక్షులు కామల్ల  వెంకయ్య సహాయ కార్యదర్శి ఎడవల్లి చంద్రయ్య కోశాధికారి పల్లెపంగ బడి సైదులు
కార్యవర్గ సభ్యులు చెక్క లక్ష్మణరావు, ముకుందాపురం శ్రీను తదితరులుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జానపద కళలను బతికించేందుకు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. బస్సులు, రైళ్లలో కళాకారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి జానపద కళాకారునికి నెలకు రూ.5000 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి మండలంలో జానపద కళలను ప్రోత్సహిస్తామని తెలిపారు.