స్వచ్ఛ హరిత విద్యాలయంగా వెళ్జీపూర్ జడ్పిహెచ్ఎస్ ఎంపిక
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 02కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ హరిత విద్యాలయ కార్యక్రమం కోసం చేపట్టిన సర్వేలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెళ్జీపూర్ జిల్లా స్థాయిలో మెరుగైన ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, విద్యాధికారి వినోద్ చేతుల మీదుగా పాఠశాలకు ప్రశంస పత్రం అందజేశారు.జిల్లా వ్యాప్తంగా 650 పాఠశాలలు పాల్గొన్న ఈ ఎంపికలో, 9 నుండి 12వ తరగతి వర్గంలో వెళ్జీపూర్ జడ్పిహెచ్ఎస్ స్వచ్ఛ హరితవిద్యాలయగా నిలిచి గర్వకారణంగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాట్నపెల్లి స్వామి రెడ్డి...