manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 4:50 pm Posted by : Mana Praja Prathinidhi

మెదక్ లో వైస్ చైర్మన్ నరేష్ గౌడ్‌కు ఘన సన్మానం

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కారం – జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ
మెదక్ జిల్లా.మనప్రజాప్రతిని//ఫిబ్రవరి19
మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, నూతనంగా మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన దొంతి నరేష్ గౌడ్‌ను గురువారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన చేసిన కృషిని జర్నలిస్టులు కొనియాడారు.రానున్న రోజుల్లోనూ పట్టణ ప్రజల అభ్యున్నతితో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా కృషి చేయాలని కోరారు. దీనికి స్పందించిన నరేష్ గౌడ్, తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జర్నలిస్టులు కామాటి కీషన్, సురేంద్ర రెడ్డి, ప్రకాష్, కె. రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.