manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 11:32 am Posted by : Mana Praja Prathinidhi

కోతుల బెడదతో గ్రామస్తుల అల్లకల్లోలం చర్యలుతీసుకోవాలనిడిమాండ్

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం,సిద్దిపేటజిల్లా
కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో గత కొద్ది రోజులుగా కోతుల బెడద తీవ్రమైంది. గ్రామ పరిధిలో సుమారు 100 నుంచి 200 వరకు కోతులు ఇష్టానుసారంగా సంచరిస్తూ ప్రజలను తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తున్నాయి.గ్రామానికి చెందిన మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, పాఠశాల పిల్లలు రోడ్డుపై నడవడానికి భయపడుతున్నారని, ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోననే ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోతులు రహదారులపై సంచరిస్తూ, ప్రయాణికులపై దాడులు చేయడంతో ప్రమాదాలూ చోటుచేసు కున్నాయని పేర్కొన్నారు.ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రిని చిందరవందర చేయడం, వస్తువులను బయటకు పారేయడం, చిన్నపిల్లలను భయపెట్టడం, కొరికే ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో అటవీ శాఖ, పశుసంరక్షణ శాఖ, గ్రామ పంచాయితీ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి కోతులను పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే కోతుల సంఖ్య నియంత్రణ కోసం అవసరమైన కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.