ఖాళీ అవుతున్న గ్రామాలు..<br>పట్టణాలపై పెరుగుతున్న భారం
గంజాయి రమేష్ జనవరి 19 (మనప్రజాప్రతినిధి):దేశవ్యాప్తంగా గ్రామాల నుంచి పట్టణాల వైపు జరుగుతున్న వలస ఇప్పుడు సాధారణ ఘటనగా మారింది. వ్యవసాయం లాభసాటి వృత్తిగా నిలవకపోవడం, సాగునీటి సమస్యలు, పంటల ధరలపై అనిశ్చితి, ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలు గ్రామీణ యువతను పట్టణాల బాట పట్టిస్తున్నాయి. చదువు పూర్తయిన యువకుడు గ్రామంలో భవిష్యత్ కనిపించక నగరమే ఆశగా మారుతోంది. గ్రామాల్లో నాణ్యమైన విద్య, ఆరోగ్యం, రవాణా వంటి మౌలిక వసతుల లోపం కూడా ఈ వలసను వేగవంతం చేస్తోంది.- ఖాళీ అవుతున్న గ్రామాలు...