పాలనలో పారదర్శకత ఎక్కడ?

- హామీలకే పరిమితమైన పారదర్శక పాలన- ప్రజల డబ్బుపై స్పష్టత లేని నిర్ణయాలు- జవాబుదారీతనం కోరితే మౌనమే సమాధానమా?గంజాయి శ్రీనివాస్:జనవరి 8 (మనప్రజాప్రతినిధి): ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు సమాధానం చెప్పే పాలన అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హామీలను మరిచిపోయారా అనే అనుమానం ప్రజల్లో రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? విధానాల వెనుక ఉన్న లెక్కలు ఏమిటి? ఖర్చుల వివరాలు ఎక్కడ? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనిపించకపోవడం ప్రజల...