manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 8:42 am Posted by : Mana Praja Prathinidhi

విద్యుదాఘాతానికి మహిళ బలి

మేకల మేత కోయడానికి వెళ్లి విషాదాంతం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.మే29
మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన బొగ్గుల లక్ష్మి (40) అనే వివాహిత గురువారం ఉదయం మేకలకు మేత కోసం చెట్టు ఆకులు కోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి ఇంటి సమీపంలోని చెట్టు ఎక్కి మేకల మేత కోసం ఆకులు కోస్తుండగా, అక్కడి గుండా వెళ్లిన 11 కేవీ విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తూ తగిలాయి. దీంతో ఆమె ఒక్కసారిగా చెట్టు నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి మరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.