manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 9:16 am Posted by : MANA PRAJA PRATINIDHI

పాము కాటుతో మహిళ మృతి

మనప్రజాప్రతినిధి//చేర్యాల,014

చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన బత్తుల పద్మ (55) ఈనెల 8న తన వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురై సిద్దిపేటలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.