గ్రామ పాలనకు మహిళల అండ-నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌కు ఘన సన్మానం

•చందాయిపేట్‌లో మహిళాసంఘాల ఆధ్వర్యంలో శాలువాలతో సత్కారంమెదక్ జిల్లా,చేగుంట.జనవరి14(మనప్రజాప్రతినిధి)చేగుంట మండలం చందాయిపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యం లో ఘనమైన సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం ఎంత కీలకమోఈకార్యక్రమం మరోసారి చాటింది.సీఏ కవిత, వీఓ రమ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు బోనాల జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, పారదర్శకతతో గ్రామ పాలన కొనసాగించాలని మహిళా సంఘాల నాయకులు...