Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణసిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల నవంబర్ ,20

సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై జక్కాపూర్ గ్రామ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  సిరిసిల్ల జిల్లా మండపల్లికి చెందిన ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందాడు.ఎదురుగా వేగంగా వస్తున్న కారు, అదుపు తప్పి కుడివైపు వెళ్లి మరీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెనుక వస్తున్న ఒక వాహనంలోని డాష్ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.డాష్ కెమెరా రికార్డులను ఆధారంగా చేసుకుని కారు డ్రైవర్‌పై కేసు నమోదు. తిరుపతి మృతితో తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular