Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅతివేగంతో హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లిన బోర్వెల్ వాహనం

అతివేగంతో హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లిన బోర్వెల్ వాహనం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 28
జిల్లా కేంద్రంలోని చంద్రంపేట మూలమలుపు వద్ద ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అతివేగంగా వచ్చిన ఓ బోర్వెల్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది.స్థానికుల కథనం ప్రకారం, గణేష్ బోర్వెల్‌కు చెందిన వాహనం అతివేగంగా, అజాగ్రత్తగా చంద్రంపేట మలుపు వద్దకు చేరుకోవడంతో నియంత్రణ కోల్పోయింది. వాహనం నేరుగా ఆలయ గోడను బలంగా ఢీకొట్టడంతో గోడ పూర్తిగా ధ్వంసమైంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రంపేట మూలమలుపు ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమని వారు పేర్కొన్నారు. ఈ మలుపు వద్ద జీవనోపాధి కోసం అనేక మంది మొక్కజొన్న కంకులు విక్రయిస్తుండగా, బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులతో ఎప్పుడూ సందడి నెలకొని ఉంటుంది.ఆదివారం కావడంతో జనసంచారం తక్కువగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని, లేకపోతే తీవ్ర ప్రాణ నష్టం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.అధికారులకు విన్నపంచంద్రంపేట మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి:
ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనాల వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు లేదా ఇతర తగిన భద్రతా చర్యలు తీసుకోవాలనిస్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular