•గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
టీమ్ కార్తిక ఫౌండేషన్ సేవా కార్యక్రమం
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి.దుబ్బాక మండలండిసెంబర్ 24
దుబ్బాక మండలంలోని హసన్ మీరాపూర్ గ్రామంలో 8 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలకు టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ హస్సన్ మీరాపూర్ గ్రామానికి చెందిన బల్తే మౌనిక, ఇంటి మహేశ్వరి అనే గర్భిణీ స్త్రీలకు చీర సార్లతో పాటు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా కార్తిక గౌడ్ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రసవ సమయంలో తల్లికి శారీరక బలం కలగాలని, తల్లి–బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చే ప్రతి తల్లి ఇంటి మహాలక్ష్మి అని పేర్కొన్నారు. ఈ సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.తల్లి ఆరోగ్యం బిడ్డ భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ, గర్భిణీ స్త్రీల సంక్షేమానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, మహేందర్ గౌడ్, పరశురామ్, ఎండి. ఇర్ఫాన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
“మా ఇంటి మహాలక్ష్మి – కత్తి కార్తీక శ్రీమంతం కానుక”
RELATED ARTICLES

