మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 13
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో దశ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు.
సారంపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.అలాగే వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వీల్‌చైర్లు, ఇతర మౌలిక వసతుల ను తనిఖీ చేశారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్యంగా ఓటింగ్ అనంతరం చేపట్టాల్సిన భద్రతా చర్యలు,రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్ర మంలో సీపీఓ శ్రీనివాసాచారి, తహసీల్దార్ జయంత్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఎంపీఓతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సారంపల్లి పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ
RELATED ARTICLES

